హన్సికకు ఇంత మంచి అవకాశం మళ్లీ దొరకదు.

హన్సికకు ఇంత మంచి అవకాశం మళ్లీ దొరకదు.

Published on Sep 4, 2014 9:46 PM IST

hansika
‘చంద్రముఖి’లో జ్యోతిక తరహాలో ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతుంది గ్లామరస్ గర్ల్ హన్సిక. సుందర్.సి దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ సినిమా ‘అరణ్మనై’. ఇప్పటివరకు హన్సిక నటించిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది. హారర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 19న తమిళంలో విడుదలవుతుంది. ప్రేక్షకులను హన్సిక ఎంత వరకు భయపెడుతుందో చూడాలి. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లు ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

గ్లామరస్ పాత్రలలో నటించిన హన్సిక తొలిసారిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించింది. నటిగా నిరూపించుకుంటుందో..? లేక అందాల ప్రదర్సనకె పరిమితం అవుతుందో..? ఇంతకన్నా మంచి అవకాశం హన్సికకు మళ్లీ దొరకదు. ఈ సినిమాలో లక్ష్మి రాయ్, ఆండ్రియా, సంతానం, దర్శకుడు సుందర్.సి ముఖ్య పాత్రలలో నటించారు.

తాజా వార్తలు