బాలయ్య సినిమాకు భారీ డీల్.. సెట్టైతే మాత్రం కొత్త రికార్డే !

Published on Sep 24, 2020 3:00 am IST


నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో ఒక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉండగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో తిరిగి రీస్టార్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. ఈ సినిమా బాలయ్య, బోయపాటిల కలయికలో వస్తున్న మూడవ చిత్రం. వీరిద్దరూ చేసిన మొదటి చిత్రం ‘సింహ’ భారీ బ్లాక్ బస్టర్ కాగా రెండవ చిత్రం ‘లెజెండ్’ అంతకు మించిన విజయాన్ని అందుకుంది. దీంతో వీరిద్దరిదీ హాట్ కాంబినేషన్ అయింది. అందుకే వీరి మూడవ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి రెండు చిత్రాలను మించి ఈ సినిమాను తీర్చిదిద్దాలని బోయపాటి పనుచేస్తుంటే ఈ చిత్రంతో ‘సింహ’ రోజుల్ని అభిమానులకు గుర్తుచేయాలని బాలయ్య ఆశిస్తున్నారు.

ఈ సినిమా మీదున్న హైప్ కారణంగా చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొరకు ప్రముఖ ఓటీటీ సంస్థ ఒకటి 9 నుండి 10 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చిందని తెలుస్తోంది. ఇవి కేవలం స్ట్రీమింగ్ రైట్స్ మాత్రమే. డిజిటల్ రైట్స్ వేరే ఉంటాయి. స్ట్రీమింగ్ హక్కులే ఇంత ధర పలికితే డిజిటల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడవుతాయనడంలో సందేహం లేదు. ఈ డీల్ గనుక ఫిక్స్ అయితే బాలయ్య కెరియర్లో ఇదే రికార్డ్ డీల్ అవుతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని భావిస్తున్నారు నిర్మాతలు. అనుకున్న సమయానికి షూట్ మూగిస్తే సంక్రాంతికే బాలయ్య సందడి ఉండవచ్చు. ఇందులో బాలయ్యకు జోడీగా అంజలి నటించనుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More