కరోనా రోగులకు నాగ చైతన్య సలహా

Published on Aug 1, 2020 6:25 pm IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ, ప్రజలు ప్రాణ భయంతో అల్లాడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలల్లో మరణాలు సంభవించాయి. సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడా లేకుండా దీని బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కినేని హీరో నాగ చైత్యన్య ఓ కొత్త ఆలోచనతో వచ్చారు. కరోనా వైరస్ బారిన పడినవారు మానసిక దృఢత్వం కోల్పోవడం వలననే చనిపోతున్నారని అన్నారు. కొరోనాను జయిస్తాం అని ఆత్మస్థైర్యం తో ఉన్నవారిని కరోనా ఏమి చేయదు అని ఆయన అంటున్నారు.

ఇక నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ మూవీలో నటిస్తున్నారు. సెన్సిబుల్ లవ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఎప్పుడో విడుదల కావాల్సి వుంది. ఐతే లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More