చెన్నైలో అనుష్క హవా ఎంతవరకు పనిచేసింది !

లేడీ సూపర్ స్టార్ అనుష్క నటించిన ‘భాగమతి’ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలైంది. నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రత్యేక ప్రమోషన్లు చేపట్టడం, తమిళ ప్రేక్షకుల్లో అనుష్క పట్ల మంచి క్రేజ్ నెలకొని ఉండటం సినిమాకి బాగా కలిసొచ్చింది. అంతేగాక మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉండటంతో ఓపెనింగ్స్ బాగానే దక్కాయి.

చెన్నై సిటీలో తొలి రెండు రోజుల్లో తెలుగు, తమిళ వెర్షన్లకు కలిపి సినిమా సుమారు రూ.68 లక్షల గ్రాస్ ను అందుకుంది. ఈరోజు ఆదివారం కావడంతో ఈ మొత్తం కోటి రూపాయల్ని తాకొచ్చని అంచనా. హీరోయిన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రానికి ఈ స్థాయిలో వసూళ్ళు రావడం నిజంగా అభినందనీయమనే చెప్పాలి. ఇకపోతే తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో కూడా సినిమాకు మంచి వసూళ్లే వస్తున్నాయి.