ఏకంగా 5 పాన్ ఇండియా చిత్రాల్లో భాగ్యశ్రీ

ఏకంగా 5 పాన్ ఇండియా చిత్రాల్లో భాగ్యశ్రీ

Published on Mar 2, 2025 2:00 AM IST

మాస్ రాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఇక ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ భాగ్యశ్రీ బొర్సె. అమ్మడు తన తొలి చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకుంది. కట్ చేస్తే, ఫస్ట్ సినిమానే డిజాస్టర్‌గా మిగిలింది.

ఇక తొలి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత, ఆమెకు ఆఫర్లు కష్టమని అందరూ అనుకున్నారు. కానీ, ఎవరి ఊహలకు అందకుండా తన నెక్స్ట్ చిత్రాలను వరుసబెట్టి చేస్తోంది ఈ బ్యూటీ. ఏకంగా 5 పాన్ ఇండియా చిత్రాల్లో భాగ్యశ్రీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ మూవీలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ నటిస్తుంది. ఈ సినిమాతో పాటు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కొత్త సినిమాలోనూ భాగ్రశ్రీ నటిస్తుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘కాంతా’ మూవీలోని భాగ్యశ్రీనే హీరోయిన్. వీటితో పాటు సూర్య-వెంకీ అట్లూరి కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా భాగ్యశ్రీ హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తోంది.

ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, పాన్ ఇండియా హీరో ప్రభాస్ త్వరలోనే ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ నటించనుందట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి లుక్ టెస్ట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా 5 పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ తనదైన క్రేజ్‌ను చూపెడుతున్న ఈ బ్యూటీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు