మరో భాషలోకి భాగ్యశ్రీ.. ఈసారి ఏకంగా స్టార్ హీరోతో..!

మరో భాషలోకి భాగ్యశ్రీ.. ఈసారి ఏకంగా స్టార్ హీరోతో..!

Published on Jun 25, 2026 9:03 PM IST

‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే, ఆ తర్వాత ఆమె నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’, ‘కింగ్డమ్’, ‘కాంత’ చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో ‘లెనిన్’, తమిళంలో శివకార్తికేయన్ సరసన ‘సెయాన్’ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు తాజాగా మలయాళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతోంది.

దర్శకుడు విష్ణు మోహన్ తెరకెక్కిస్తున్న ఓ నూతన చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సరసన ఒక కీలక పాత్ర కోసం భాగ్యశ్రీ ఎంపికైంది. ఇప్పటికే హిందీలోనూ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే దేశంలోని నాలుగు ప్రధాన భాషల్లో ప్రాజెక్టులు దక్కించుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు