సుధీర్ బాబు ‘భలే మంచిరోజు’ ఆడియో రిలీజ్ డేట్

సుధీర్ బాబు ‘భలే మంచిరోజు’ ఆడియో రిలీజ్ డేట్

Published on Nov 13, 2015 9:55 AM IST

Bhale-manchi-roju
‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ లాంటి రెండు విభిన్న సినిమాలతో ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన మరో డిఫరెంట్ సినిమా ‘భలే మంచి రోజు’. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో ఇది వరకూ చూడని ఓ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. పోర్స్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా పూర్తవుతున్న ఈ సినిమా ఫస్ట్టీజర్ ని కూడి రోజుల క్రితమే రిలీజ్ చేసారు. ఒక అమ్మాయి మిస్సింగ్ అనే కాన్సెప్ట్ ని చెబుతూ ఫుల్ కామెడీగా ప్రజంట్ చేసిన ఫస్ట్ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ చిత్ర ఎం ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది. నవంబర్ 25వ తేదీన ‘భలే మంచిరోజు’ ఆడియోని రిలీజ్ చేయనున్నారు. అలాగే ఆడియో కంటే ముందే ఒక ఫుల్ సాంగ్ ని ఎఫ్ఎం ద్వారా రిలీజ్ చేయనున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో చండీఘర్ బ్యూటీ వమిక గబ్బి హీరోయిన్ గా పరిచయం కానుంది. సుధీర్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన విజయ్ – శశి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. సన్నీ ఎంఆర్ మ్యూజిక్ మరియు శాందత్ విజువల్స్ కూడా ఈ సినిమాకి స్పెషల్ హెల్ప్ అవుతాయని టీజర్ చూసిన వారి అభిప్రాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు