సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్తగా సినీ పరిశ్రమకు పరిచయమైన హీరో సుధీర్ బాబు. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, రీసెంట్‌గా వచ్చిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాతో మెప్పించి ఆ వెంటనే భలే మంచి రోజు అంటూ ఓ కొత్త సినిమాను రిలీజ్‌కు రెడీ చేశారు. కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను 70 ఎంఎం బ్యానర్‌పై విజయ్, శశి నిర్మించారు.
మహేష్ బాబు చేతుల మీదుగా ఈ మధ్యే విడుదలైన ఆడియోకు, అదే రోజు విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ట్రైలర్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి చెలరేగింది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చివరి దశకు చేర్చిన సినిమా యూనిట్ క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుందని, ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని సుధీర్ బాబు ఈ సందర్భంగా తెలిపారు.


