మహేష్ కోసం ‘భలే మంచి రోజు’ టీం భారీ ఏర్పాట్లు!

మహేష్ కోసం ‘భలే మంచి రోజు’ టీం భారీ ఏర్పాట్లు!

Published on Nov 25, 2015 3:36 PM IST

Bhale-ManchiRoju
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్తగా సినీ పరిశ్రమకు పరిచయమైన హీరో సుధీర్ బాబు. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, రీసెంట్‌గా వచ్చిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమాతో అటూ విమర్శకుల ప్రశంసలను, బాక్సాఫీస్ విజయాన్నీ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఈ హీరో, ‘భలే మంచి రోజు’ అనే సినిమాను అప్పుడే విడుదలకు సిద్ధం చేసేశారు. భలే మంచి రోజు ఆడియో ఆవిష్కరణ వేడుకను హైద్రాబాద్‌లో వైభవంగా జరపనున్న విషయం తెలిసిందే.

శిల్పకళావేదికలో ఈ సాయంత్రం జరగనున్న వేడుకకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సూపర్ స్టార్ మహేష్ ముఖ్య అతిథిగా హాజరు కానుండడంతో మూవీ టీమ్ ఈ వేడుకను పకడ్బందీగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక మహేష్ రానుండడంతో ఈ వేడుకకు అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. కొత్త దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన వామికా గబ్బీ హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు