
ఈ ఏడాది ‘మోసగాళ్ళకు మోసగాడు’, ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ లాంటి డీసెంట్ డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో సుధీర్ బాబు. ఈ రెండు సినిమాల తర్వాత సుధీర్ బాబు నుంచి రానున్న మరో డిఫరెంట్ సినిమా ‘భలే మంచి రోజు’. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో ఇది వరకూ చూడని ఓ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. దాంతో ఈ చిత్ర టీం ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో ‘భలే మంచి రోజు’ ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసేసారు.
ఈ రోజు రిలీజ్ అయిన టీజర్ లోని డిఫరెంట్ కాన్సెప్ట్ టీజర్ అందరినీ మెప్పిస్తుంది. ఒక అమ్మాయి మిస్సింగ్ అనే కాన్సెప్ట్ ని చెబుతూ ఫుల్ కామెడీగా ప్రజంట్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. కామెడీ బిట్స్ తో పాటు టీజర్ చివర్లో వచ్చే పోసాని పంచ్ డైలాగ్ ‘అయ్యా మీ స్టోరీలకి ఓ దండం, నా ఫోటోకి దండ పడకుండా చూస్కోండి’ అనే డైలాగ్ బాగా పేలింది. అలాగే సన్నీ ఎంఆర్ మ్యూజిక్ మరియు శాందత్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో చండీఘర్ బ్యూటీ వమిక గబ్బి హీరోయిన్ గా పరిచయం కానుంది. సుధీర్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన విజయ్ – శశి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా ఆడియోని ఈ నెలాఖర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

