ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన రామ్ చరణ్ యొక్క ‘రంగస్థలం’ చాలా ఏరియాలతో పాటు చెన్నై సిటీలో కూడ రికార్డ్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. చెన్నైలో తొలిరోజు ఈ సినిమా రూ.25 లక్షలు రాబట్టి మొదటి స్థానంలో నిలవగా ఇప్పుడు ఆ రికార్డును నిన్న రిలీజైన మహేష్ బాబు యొక్క ‘భరత్ అనే నేను’ బద్దలు కొట్టింది.
మొదటిరోజు ఈ చిత్రం రూ.27 లక్షలకు పైగానే గ్రాస్ ను రాబట్టి అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన తెలుగు చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఏపి, తెలంగాణాల్లో, ఓవర్సీస్లో సైతం భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం మొదటి రోజే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దానయ్య నిర్మించారు.


