సెన్సార్ కు సిద్దమైన ‘భరత్ అనే నేను’ !

12th, April 2018 - 03:41:44 PM

ఈ వేసవికి విడుదలకానున్న భారీ చిత్రం ‘భరత్ అనే నేను’. మహేష్ బాబు, కొరటాల శివల కలయికలో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తారా స్థాయి అంచనాలున్నాయి. ప్రస్తుతం చిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు రేపు జరగనున్నాయి.

డివివి.దానయ్య నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నారు. టీజర్, ట్రైలర్లతో పాటు కొద్దిరోజుల క్రితమే రిలీజైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. కైరా అద్వానీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.