కొరటాల శివ, మహేష్ బాబుల కలయికలో రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రం హిట్ దిశగా దూసుకుపోతోంది. మహేష్ మొదటిసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో చేసిన ఈ చిత్రం ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమేగాక గత రెండేళ్లుగా సరైన హిట్ లేని ఆయనకు నూతనోత్సాహాన్ని అందించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి వారంలో రూ.54 కోట్ల షేర్ ను, ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.
ఇక కలెక్షన్లకు కీలకంగా చెప్పుకునే ఉత్తరాంధ్ర ఏరియాలో ఇప్పటి వరకు 8.36 కోట్ల షేర్ ను రాబట్టుకుంది. ఇక ఓవర్సీస్లో కూడ 3.5 మిలియన్లకు చేరువగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే ఆ మార్కును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డివివి.దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయకిగా నటించారు.


