భారీ సీక్వెల్‌ బ్రేక్ కి విభేదాలే కార‌ణమా ?

Published on Mar 11, 2019 1:24 pm IST

కమల్‌ హాసన్ – శంకర్‌ కలయికలో భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ చెన్నైలో ఘనంగా ప్రారంభం అయింది. కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు.

అయితే ఇటీవలే షూటింగ్ ను ప్రారంభించిన ఈ సినిమా.. మళ్ళీ షూటింగ్ ను ఆపేసినట్లు తెలుస్తోంది. బ‌డ్జెట్ విష‌యంలో ద‌ర్శ‌కుడితో విభేదాల కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందట.

మొద‌టి షెడ్యూల్ షూటింగ్ కోసం అనుకున్న బ‌డ్జెట్‌ కంటే ఎక్కువ అవ్వడంతో నిర్మతలు షూట్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి టెక్ మాంత్రికుడు శంకర్ ఈ చిత్రాన్ని భారీ హంగులతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నా కలిసి రావడంలేదు.

ఇక కమల్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది. 2020లో ఈ సినిమా సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More