భరత్ అనే నేను సినిమా లేటెస్ట్ న్యూస్ !

భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు అర్బన్ ఏరియాకు చెందిన వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడు. సిఎం గా మహేష్ బాబు నటిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే. త్వరలో సెన్సార్ జరుపుకోనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 7న జరగబోతోంది.

ఈ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నాడని సమాచారం. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమాలో మొత్తం 6 పాటలు ఉన్నాయి. అందులో మూడు పాటలు ఇటీవలే విడుదల అవ్వడం జరిగింది. మిగిలిన సాంగ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసే అవకాశం ఉంది.