బిగ్ బాస్ కంటెస్టెంట్ కు భారీ పారితోషికం !
Published on Sep 6, 2018 9:55 am IST

హిందీలో అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లితెర రియల్టీ గేమ్ షో ‘బిగ్ బాస్’. బాలీవడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈషో అక్కడ విజవంతంగా 11సీజన్స్ ను పూర్తి చేసుకొని 12వ సీజన్లోకి అడుగుపెట్టింది. మంగళవారం బిగ్ బాస్12వ సీజన్ గోవా లో లాంఛనంగా ప్రారంభమైంది.

ఇక ఈ సీజన్ లో పాల్గొంటున్న కంటెస్టెంట్లల యొక్క పారితోషికాల గురించి బయట ఎక్కువగా చర్చ జరుగుతుంది. తాజాగా ఈషోలో బాలీవుడ్ నటి భారతి సింగ్ తో పాటు ఆమె భర్త హార్ష్ లింబాచియాలు పాల్గొంటున్నారు. ఈ జోడి ఏకంగా వారానికి 50లక్షల పారితోషికాన్ని డిమాండ్ చేశారట. షో నిర్వహాలుకూడా ఈ భారీ మొత్తం ఇవ్వడానికి అగీకరించారట.

భారతి సింగ్ కు వారానికి 30లక్షలు అలాగే హార్ష్ కు 20 లక్షల చొప్పున అందనుంది. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ పరంగా ఇదే అత్యధిక రెమ్యూనరేషన్ కావడం విశేషం. ఇంతకుముందు దీపికా కాకర్ వారానికి 15లక్షలు , హీనా ఖాన్ 8లక్షల పారితోషికాన్ని తీసుకున్నారు.

  • 8
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook