విశాల్ పై దర్శకుడు భారతీ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు

Published on Jun 19, 2019 1:00 am IST

సీనియర్ దర్శకుడు భారతి రాజా విశాల్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాల్ ని ఉద్దేశిస్తూ నడిగర్ సంగంలో ఓ పందికొక్కు దూరింది అన్నారు. ఐనా తమిళ పరిశ్రమపై తమిళేతరుల పెత్తనమేంటి, విశాల్ ఓ తెలుగు వాడంటూ ప్రాంతీయ,భాషా బేధాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. ఈసారి విశాల్ ని ఓడించి మన తమిళుడైన భాగ్యరాజ్ ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఎప్పుడు ఇండస్డ్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

భారతి రాజా దర్శకత్వంలో వచ్చిన “పల్నాడు” మూవీని విశాల్ నటించి నిర్మించారు. తెలుగు వాడైన విశాల్ పెత్తనాన్ని సహించలేని తమిళ సీనియర్ నటులందరూ ఏకమై ఈ సారి విశాల్ ని ఓడించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 26న నడిగర్ సంగం ఎన్నికలు జరగనున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More