‘భవదీయుడు భగత్ సింగ్’.. రీమేక్ లపై ఫైనల్ గా సాలిడ్ క్లారిటీ!

‘భవదీయుడు భగత్ సింగ్’.. రీమేక్ లపై ఫైనల్ గా సాలిడ్ క్లారిటీ!

Published on Dec 13, 2025 11:01 PM IST

bhavadeeyudu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా విషయంలో మెయిన్ గా ఈ కాంబినేషన్ పరంగా మొదటి నుంచీ కొన్ని అనుమానాలు, కామెంట్స్ అయితే సినీ వర్గాల్లో ఉన్నాయి. మరి వీటిని నేడు హరీష్ శంకర్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో క్లియర్ చేశారు.

భవదీయుడు భగత్ సింగ్.. ఉస్తాద్ గా మారడం వెనుక బ్యాక్ స్టోరీ

ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అసలు భవదీయుడు భగత్ సింగ్ నుంచి ఎందుకు ఉస్తాద్ భగత్ సింగ్ కి మారాల్సి వచ్చిందో రివీల్ చేశారు. తాను పవన్ తో రెండో సినిమా కోసం ఆలోచించినప్పుడు ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక ఖుషి తరహాలో అనుకున్నానని కానీ బయట ఎక్కడ కనిపించినా అభిమానులు మాత్రం మళ్ళీ గబ్బర్ సింగ్ ఎప్పుడు అని అడిగేవారు అని కానీ భవదీయుడు భగత్ సింగ్ లో ఎక్కడో క్లాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండడం మూలాన తాము మళ్ళీ ప్లాన్ మార్చాల్సి వచ్చింది అని తెలిపారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదు

ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ చేసినప్పుడు చాలా నెగిటివ్ వచ్చింది. తమకి రీమేక్స్ వద్దు మొర్రో అనుకుని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలానే రచ్చ చేశారు. దానిని ఫస్ట్ గ్లింప్స్ తో హరీష్ బ్రేక్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇది తమిళ చిత్రం ‘తేరి’ కి రీమేక్ అని చాలానే కామెంట్స్ కూడా వచ్చాయి.

అయితే దీనిపై కూడా హరీష్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. భవదీయుడు ఆగిన తర్వాత ఇంకో సినిమా అనుకున్నప్పుడు రీమేక్ చేద్దామా అని కూడా అనుకున్నామని కానీ అదీ సెట్ అవ్వలేదు ఆ తర్వాత వచ్చిందే ఉస్తాద్ భగత్ సింగ్ అని ఈ సబ్జెక్టు అందరికీ కనెక్ట్ కావడంతో అక్కడ నుంచి ఇక ట్రాక్ ఎక్కేసింది అని తాను తెలిపారు. సో ఉస్తాద్ భగత్ సింగ్ స్ట్రైట్ సినిమానే అని చెప్పవచ్చు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు