LIK: ప్రదీప్ దొరికిపోయాడు.. ఆ హీరో సేఫ్ అయిపోయాడు!

LIK: ప్రదీప్ దొరికిపోయాడు.. ఆ హీరో సేఫ్ అయిపోయాడు!

Published on Apr 17, 2026 9:00 AM IST

1

తమిళ్ సహా తెలుగులో కూడా మంచి మార్కెట్ ని సెట్ చేసుకున్న యువ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన మొదటి మూడు సినిమాలు లవ్ టుడే, డ్రాగన్ అలాగే డ్యూడ్ సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యి అదరగొట్టాయి. ఈ సినిమాలు తర్వాత అదే సక్సెస్ ని కొత్త సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో కూడా కొనసాగిస్తాడని అంతా అనుకున్నారు కానీ ఆ సినిమా ఊహించని ఫలితాన్ని అందుకోవాల్సి వచ్చింది. దీనితో ప్రదీప్ హిట్ స్ట్రీక్ కి చెక్ పడింది.

అయితే అసలు ప్రదీప్ ఫస్ట్ ప్లాప్ తనది కాదట. ఈ సినిమాకి మొదటి హీరో ప్రదీప్ కాకుండా మరో యువ హీరో చేయాల్సింది. ఆ హీరో ఎవరో కూడా కాదు శివ కార్తికేయన్ అట. దర్శకుడు విగ్నేష్ శివన్ మొదట శివ కార్తికేయన్ కోసం ప్లాన్ చేస్తే వారి కాంబినేషన్ అనౌన్స్ అయ్యి ఆగిపోయింది. అది కూడా ఎపుడో 2019 లో ప్రాజెక్ట్ ఇది కాగా 2020 కి రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఆరేళ్ళు వెనక్కి వెళ్లి ఈ సినిమా ప్రదీప్ కి మొదటి ప్లాప్ గా మిగిలిపోయింది.

తాజా వార్తలు