కాలం మా జీవితాలను వేరేలా చేసింది – భవ్య బిష్ణోయ్‌

Published on Jul 5, 2021 7:30 pm IST

హీరోయిన్ మెహరీన్ కి, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌ తో జరిగిన నిశ్చితార్థం రద్దు అయిన విషయాన్ని మెహరీన్ ట్వీట్ చేస్తూ.. ‘భవ్య బిష్ణోయ్ నేను కలిసి మా నిశ్చితార్థాన్ని విరమించుకోవాలని నిర్ణయంచుకున్నాము’ అంటూ క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా భవ్య బిష్ణోయ్‌ తాము పెళ్లిపీటలు ఎక్కడం లేదని ఈ అంశం పై తన వివరణ ఇచ్చాడు. ‘మెహ్రీన్‌ ని ప్రేమించాను. కానీ మా అభిప్రాయభేదాల కారణంగా జులై 1న మా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాము.

మెహ్రీన్‌ నాకు పరిచయమైన నాటి నుంచి నేను ఆమెను ప్రేమించాను. మా జోడీ బాగుంది అనుకున్నాను. కానీ, కాలం మా జీవితాలను వేరేలా చేసింది. ఇక మెహ్రీన్‌ నుంచి నేను విడిపోతున్నందుకు బాధపడడం లేదు. మెహ్రీన్‌ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ ఇక నా పై నా ఫ్యామిలీ పై బ్యాడ్ కామెంట్స్ చేస్తే చర్యలు తీసుకుంటాను’ అంటూ భవ్య బిష్ణోయ్‌ సోషల్ మీడియా ద్వారా తన వెర్షన్ ను వినిపించాడు. కొన్ని ఫ్యామిలీ కారణాల వల్ల వీరి ప్రేమ ఒకటి కాలేకపోయిందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :