ఇద్దరు యువ హీరోలతో సినిమాలు చేస్తోన్న భవ్య క్రియేషన్స్ !
Published on Mar 13, 2018 6:45 pm IST

‘ఛలో’ సినిమా విడుదల తరువాత నాగ శౌర్య స్పీడ్ పెంచాడు. ఈ హీరో సొంత సంస్థ ఐరా క్రియేషన్స్ లో శ్రీనివాస్ చక్రవర్తితో త్వరలో సినిమా స్టార్ట్ చెయ్యబోతున్నాడు. ఈ మూవీకి ‘నర్తనశాల’ టైటిల్ ను ఖరారు చేసారు. ఈ సినిమాతో పాటు భవ్య క్రియేషన్స్ సంస్థలో కూడ నాగ శౌర్య ఒక సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి డైరెక్టర్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.

త్వరలో ఈ ప్రాజెక్ట్ కు సంభందించి క్లారిటి రావచ్చు. ఇకపోతే భవ్య క్రియేషన్స్ సంస్థ రామ్ తో కూడ ఒక సినిమా చెయ్యబోతోంది. ‘గరుడవేగ’ సినిమాతో మంచి విజయం సాధించిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమాను వచ్చే నెలలో అధికారికంగా ప్రకటించనున్నారు.

 
Like us on Facebook