చరణ్ పోస్టర్ దెబ్బకు భీం పై పెరిగిన అంచనాలు.!

Published on Mar 27, 2021 9:10 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. రోజులు గడుస్తున్నా కొద్దీ ఇండియాలో ఈ సినిమాపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి.

మరి మేకర్స్ ఎప్పటికప్పుడు మేకర్స్ సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అలా నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ కాస్త ముందు గానే ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను డిజైన్ చేసి వదిలారు. అగ్గి పిడుగు అల్లూరిలా చరణ్ ను చూపిస్తూ విడుదల చేసిన పోస్టర్ కు దుమ్ము లేచే రెస్పాన్స్ వచ్చింది.

దీనితో ఇదే ఇలా ఉంటే ఇక రాబోయే భీం పోస్టర్ ఎలా ఉంటుందా అన్న టాక్ మొదలయ్యింది. ఇప్పటికే భీం అవతార్ లో కనిపించిన తారక్ కు కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి చరణ్ పై పోస్టర్ నే ఓ లెవెల్ లో ప్లాన్ చేస్తే తారక్ కు కూడా అంతే స్థాయిలో ప్లాన్ చెయ్యడం ఖాయం అని చెప్పాలి. మరి తారక్ బర్త్ డే కు జక్కన్న ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :