ఇంకా మంచి హోల్డ్ లోనే “భీమ్లా నాయక్” వసూళ్లు.!

Published on Mar 10, 2022 1:59 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు నటించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్”. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం గత ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యి పవన్ మరియు రానా ల కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. మొదటి రోజే సాలిడ్ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకొని తర్వాత రెండు వీకెండ్స్ లో కూడా మంచి వసూళ్లను భీమ్లా నాయక్ అందుకుంది.

అయితే ఇప్పుడు వీక్ డేస్ లో కూడా భీమ్లా నాయక్ మంచి వసూళ్లనే రాబట్టినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా అయితే ఈ సినిమా 13వ రోజు కూడా కోటి రూపాయలకు పైగా గ్రాస్ ని ఓవరాల్ గా అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో బాక్సాఫీస్ దగ్గర భీమ్లా నాయక్ మంచి హోల్డ్ నే కనబరిచింది అని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందివ్వగా త్రివిక్రం మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :