ఓ రేంజ్ ట్రీట్ ఇచ్చేలా ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ సింగిల్.?

Published on Aug 29, 2021 3:25 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ లలో సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంలో రానా కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఎనలేని హైప్ గత కొన్ని రోజులు కితం రిలీజ్ చేసిన మాస్ గ్లింప్స్ తో వచ్చేసింది.

మరి దీని తర్వాత మరో సాలిడ్ అప్డేట్ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ గా సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అయితే ఈ ఫస్ట్ సింగిల్ మాత్రం మాస్ ఆడియెన్స్ కి ఒక రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుంది అని టాక్. మొన్న గ్లింప్స్ కి మాస్ లో ఏ లెవెల్ హైప్ వచ్చిందో దానిని మించేలా ఈ ఫస్ట్ సింగిల్ ఉంటుందట. ఇప్పటికే ఈ సాంగ్ వినాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆల్రెడీ థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనితో ఆల్బమ్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే సెప్టెంబర్ 2 వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :