‘భీమ్లా నాయక్’ రన్ టైమ్ లాక్ చేసేసారా?

Published on Dec 9, 2021 1:01 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

అయితే జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’, జనవరి 14న ‘రాధేశ్యామ్’ వంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నా కూడా రీమేక్‌గా వస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమాపై దర్శక నిర్మాతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు త్గెలుస్తుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన మేకర్స్ రన్ టైంని కూడా లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కంటెంట్ ఉన్న సినిమా కావడం ఈ సినిమా రన్ టైమ్ ని 2 గంటల 20 నిమిషాలకు లాక్ చేశారని, రన్ టైమ్ ఇలా లాక్ చేయడం వలన కథ త్వరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :