‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ రేపు ఎన్ని గంటలకంటే..!

Published on Sep 1, 2021 11:08 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ భారీ మల్టీ స్టార్టర్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియో మరియు ఫస్ట్ గ్లింప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి రేపు టైటిల్ సాంగ్ విడుదల కాబోతుంది.

అయితే రేపు ఉదయం 11:16 గంటలకు ఈ సాంగ్‌ని రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సాంగ్‌పై అభిమానుల్లో సాలీడ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ టైటిల్ సాంగ్‌కు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :