Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ‘భీష్మ’ !
Published on Feb 12, 2019 11:01 am IST


నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. అయితే ఎపుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకూ ఈ నెల 25వ తేదీన పట్టాలెక్కనుంది.

కాగా ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈ రోజుతో పూర్తి అయిందట. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ఇక నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

దాంతో నితిన్, భీష్మ చిత్రం పై మరింత దృష్టి పెట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :