సూపర్ స్టార్ మహేష్ కి “భోళా శంకర్” టీమ్ థాంక్స్!

Published on Aug 22, 2021 9:31 pm IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పలు చిత్రాలకు సంబందించిన అప్డేట్స్ వెలువడిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో భోళా శంకర్ ప్రత్యేకం అని చెప్పుకోవాలి. మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం తో పాటుగా భోళా శంకర్ టైటిల్ రివీల్ చేయడం తో సినిమా పై క్రేజ్ పెరిగింది.

అనిల్ సుంకర నిర్మాతగా ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. అయితే ఈ చిత్రం టైటిల్ ను విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్ కి ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ థాంక్స్ చెబుతూ ఒక వీడియో ను విడుదల చేయడం జరిగింది. గతం లో సూపర్ స్టార్ మహేష్ మరియు మెగాస్టార్ చిరంజీవి కలిసి ఉన్న కొన్ని సందర్భాల జ్ఞాపకాలను ఇందులో ఉంచడం జరిగింది.

సంబంధిత సమాచారం :