లేటెస్ట్..”భోళా శంకర్” రెండో సాంగ్ కి డేట్ ఫిక్స్.!

Bholaa Shankar 1

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భోళా శంకర్”. మరి మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన భోళా మేనియా అనే ఫస్ట్ సాంగ్ అయితే మాస్ లో మంచి ఆదరణ అందుకోగా ఇక మేకర్స్ అయితే భోళా శంకర్ రెండో సాంగ్ ఫై అయితే ఇపుడు అప్డేట్ ఇచ్చేసారు.

ఇక ఈ సినిమాలో రెండో సాంగ్ గా అయితే ‘జం జం జజ్జనక’ అనే ఒక పార్టీ నెంబర్ ని అయితే ఇపుడు అనౌన్స్ చేశారు. ఇక ఈ సాంగ్ అయితే ఈ జూలై 11న సాయంత్రం 4:05 కి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇది వరకే బాస్ ఈ సాంగ్ పై చిన్న లీక్ ఇచ్చారు. మరి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ సంగీతం అందించిన ఈ ట్యూన్ ఫుల్ గా ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ చిరు కి చెల్లెలిగా నటిస్తుంది. అలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version