ఫిల్మ్‌సిటీలో బన్నీ-భోయపాటిల సినిమా షూటింగ్!

ఫిల్మ్‌సిటీలో బన్నీ-భోయపాటిల సినిమా షూటింగ్!

Published on Jul 30, 2015 12:18 PM IST

boyapati_allu_arjun
‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి రెండు వరుస విజయాలతో జోష్ మీద ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తరువాతి సినిమా కోసం దర్శకుడు భోయపాటి శ్రీనుతో జత కట్టిన విషయం తెలిసిందే! ఒక బలమైన కథాంశం చుట్టూ తనదైన భావోద్వేగాన్ని అల్లి సినిమాలు తీసే దర్శకుడు భోయపాటి, బన్నీకి సరిపడే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

ఇక పకడ్బందీగా చాలా సమయం తీసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ నిన్ననే ప్రారంభమైంది. నిన్న అల్లు అర్జున్ పాల్గొనగా హైద్రాబాద్‌లో ఓ చేజింగ్ సీన్ షూట్ చేశారు. ఇక ఈ ఉదయం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్, కాథరిన్ థ్రెసాలు ఈ సినిమాలో హీరోయ్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే! కాగా ప్రస్తుతం అల్లు అర్జున్, కాథరిన్‌లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం మరో స్టైలిష్ లుక్‌ ట్రై చేశారట.

తాజా వార్తలు