ఇంటర్వ్యూ : భూమిక చావ్లా – సమంతా చాలా ఇంటెన్సీవ్ అండ్ పవర్ ఫుల్ నటి !

Published on Sep 10, 2018 1:30 pm IST

సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘యూ టర్న్’. ఈ చిత్రంలో సమంత జర్నలిస్టు పాత్రలో నటించగా, మరో కీలక పాత్రలో భూమిక చావ్లా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ లతోనే ఈ చిత్రం మంచి బజ్ సృష్టించుకుంది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించిన భూమిక చావ్లా మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

నేను ఈ సినిమా అంగీకరించే ముందు, ఓరిజినల్ మూవీని చూశాను. నాకు చాలా బాగా నచ్చింది.

ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయాలని, ఈ చిత్ర దర్శకుడు పవన్ నన్ను సంప్రదించినప్పుడు, నేను ‘ఓరిజినల్ మూవీ’ చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఆ తర్వాత పవన్ గారు తెలుగు వర్షన్ స్క్రిప్ట్ వినిపించినప్పుడు.. నేను నిజంగా థ్రిల్ ఫీల్ అయ్యాను. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆయన స్క్రిప్ట్ ను తయారుచేసిన విధానం.. నన్ను బాగా ఆకర్షించింది. వెంటనే ఈ సినిమా చేస్తున్నానని ఆయనతో చెప్పాను.

ఈ సినిమాలో నా పాత్ర గురించి నేను పూర్తిగా అర్ధం చేసుకున్న తర్వాతే, నేను నటించడం చెయ్యటం జరిగింది.

యూ – టర్న్ సినిమాలో నా పాత్ర చాలా ముఖ్యమైనది, అలాగే ప్రధానమైనది కూడా. కథలో నా పాత్ర మిళితమై ఉంటుంది. ఈ పాత్రలో నటించడం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పటివరకు నా కెరీర్ మొత్తంలో నేను చాలా మంచి పాత్రలను ఎంచుకున్నాను, పోషించాను. అలాగే ఈ పాత్ర కూడా నా కెరీర్ లో నేను గుర్తుపెట్టుకో తగ్గ పాత్ర అవుతుంది. ఈ సినిమా చేస్తునంత సేపు మా దర్శకుడితో ఎలా చెయ్యాలి, ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలి ఎంతవరకు రియాక్ట్ అవ్వాలని ఇలా చాలా చర్చించాము. సినిమాతో నా రోల్ కూడా చాలా బాగుంటుంది.

సమంతా చాలా ఇంటెన్సీవ్ అండ్ పవర్ ఫుల్ నటి

ఈ సినిమాలో సమంతాతో కలిసి నటించడం నాకు మంచి అనుభూతి. తను నటించిన ‘ఈగ’ మరియు ‘రంగస్థలం’ సినిమాలు చూశాను. రియల్లీ.. తాను చాలా ఇంటెన్సీవ్ అండ్ పవర్ ఫుల్ నటి అని అనిపించింది. సమంతా సెట్లో కూడా సింపుల్ గా చాలా సరదాగా ఉంటుంది. కానీ ఒకసారి తను మేకప్ వేసుకున్నాకా.. పూర్తిగా ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతుంది. చిన్న ఎక్స్ ప్రెషన్ దగ్గర నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు అలా పూర్తిగా సడెన్ గా మార్చుకోవటం అంటే మాములు విషయం కాదు. ఒక్కటి మాత్రం చెప్పగలను ‘యూ – టర్న్’ సినిమా సమంతా కెరీర్ లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

సినిమాలో నా పాత్ర ఎంత సమయం ఉంటుందనేది నేనసలు పట్టించుకోను.

సినిమాలో మీరు ఎంత సేపు ఉంటారు అని చాలామంది నన్ను ప్రశ్నిస్తారు. నాకు మాత్రం ఎంత సేపు ఉన్నా, నేను చేస్తున్న పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నానా ? లేదా ? అనేది మాత్రమే నేను చూసుకుంటాను. ఎందుకంటే, సినిమాకి పాత్ర వ్యవధి ముఖ్యం కాదు. కొన్ని సన్నివేశాల్లో నటించిన, ఆ సన్నివేశాలు సినిమా మీద చాలా ప్రభావం చూపించాలి. నేను చేసే పాత్ర అలానే ఉండాలని కోరుకుంటాను. ప్రజలు అప్పుడే నటీనటులను గుర్తుంచుకుంటారు.

రచయితలు ‘30,40’ ప్లస్ నటీమణులు కోసం మరిన్ని పాత్రలను సృష్టించాలి.

రోజులు చాలా వేగంగా మారుతున్నాయి, అందుకు తగ్గట్లుగానే సినిమాలు, సినిమాల్లోని పాత్రలు కూడా చాలావరకు మారుతూ వస్తున్నాయి. అయితే నేను మా రచయితలు అందర్నీ కోరుకుంటుంది ఒక్కటే, 30, 40 ప్లస్ నటీమణుల కోసం మరిన్ని పాత్రలు రాయమని కోరుతున్నాను. అప్పుడు మాత్రమే కొన్ని మంచి కథలు మరుగున పడకుండా వెలుగు చూస్తాయి. హిందీలో విద్యాబాలన్ నటించిన ‘తుమ్హారీ సులు’ లాంటి మంచి చిత్రాలు తెలుగులోనూ వస్తాయి.

వచ్చే ఏడాదికి నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇరవై సంవత్సరాలు.

ఈ మధ్య నాకు చాలా మంచి పాత్రలు వస్తున్నాయి. అలాంటి పాత్రలనే చేయాలని, ముఖ్యంగా ప్రేక్షకులు గుర్తుపెట్టుకొని మరి అభిమానించే పాత్రలను పోషించాలని ఉంది. వచ్చే ఏడాదికి నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇరవై సంవత్సరాలు. సినిమా వాతావరణం మారడంతో, దానికి అనుగునాగానే నేను కూడా మారుతున్నాను. ప్రస్తుతం మంచి సినిమాలే చేసుకుంటూ వెళ్తున్నాను.

సంబంధిత సమాచారం :