బాలయ్యతో సీనియర్ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చిన బోయపాటి !

బాలయ్యతో సీనియర్ హీరోయిన్.. క్లారిటీ ఇచ్చిన బోయపాటి !

Published on Apr 25, 2020 1:00 AM IST

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమికా నెగెటివ్ పాత్రలో నటిస్తోందని.. పైగా భూమికా పాత్ర బాలయ్య పాత్రతో సమానంగా ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే తమ సినిమాలో భూమిక నటించట్లేదని.. ఆమె కోసం తమ సినిమాలో ఎలాంటి పాత్ర లేదని బోయపాటి స్పష్టం చేశారు. ఇక పెళ్లి తరువాత కూడా భూమికా చావ్లా వరుస సినిమాల్లో నటిస్తోంది. బాలకృష్ణ ‘రూలర్’లో కూడా ఈ మాజీ హీరోయిన్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రానికి సంభందించిన అప్ డేట్ కోసం బాలకృష్ణ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో బాలయ్య బాబు రెండు పాత్రల్లో కనిపిస్తుండటం, వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం, పైగా ఆ పాత్ర కోసం బాలయ్య గుండు చేయించుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు