సవ్యసాచి సినిమాలో ప్రధాన పాత్రలో భూమిక !

నాగచైతన్య చేస్తోన్న తాజా సినిమాను చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా కు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరొయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రేమమ్ సినిమా తరువాత చందు మొండేటి & నాగ చైతన్య కలిసి చేస్తున్న సినిమా ఇదేఅవ్వడం విశేషం.

మాధవాన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. తాజా సమాచారం మేరకు హీరోయిన్ భూమిక ఈ మూవీలో స్పెషల్ రోల్ లో కనిపించబోతుందని సమాచారం. ఎంసిఎ సినిమాలో భూమిక నానికి వదినగా నటించి మెప్పించింది. యాక్షన్ నేపద్యంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమా చైతు కెరీర్ లో మంచి హిట్ సినిమాగా నిలుస్తుందని సమాచారం.