మహేష్ సినిమా పై బిగ్ అప్ డేట్ !

Published on May 30, 2020 5:30 pm IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఉదయం 9 గంటల 9 నిముషాలకు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలను రేపు ప్రకటించనున్నారు.

ఇక సూపర్ స్టార్ కోసం పరశురామ్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రాశారని అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతనేది రేపు అధికారిక ప్రకటన వెలువడ్డాకే తెలుస్తుంది.

అయితే మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ ప‌తాకాల‌ పై నిర్మిత‌మ‌వుతుంది.

సంబంధిత సమాచారం :

More