మోడీ ప్రమాణస్వీకారానికి డుమ్మాకొట్టిన బిగ్ బి

Narendra_modi_big_b
రాష్ట్రపతి భవన్ లో ఈరోజు సాయింత్రం భారతదేశ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన బి.జె.పి నాయకుడు నరేంద్ర మోడీ పరమసంతోషంలో వున్నాడు. ఆయన ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, లతా మంగేష్కర్ మరియు కొంతమంది ప్రముఖులను పిలిచారు.

తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు బిగ్ బి మరియు లతా మంగేష్కర్ డుమ్మా కొట్టారు. రెండు గంటల క్రితం తను షూటింగ్ లో బిజీగా వున్నట్టు అమితాబ్ తెలిపారు. సమాచారం ప్రకారం వయసు ప్రభావం వలన లతా గారు ప్రయాణం చేయలేకపోయినట్లు తెలిపారు. వీరు కాక అనుపమ్ ఖేర్, వివేక్ ఒబరాయ్ వంటి ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు

Exit mobile version