జబర్ధస్త్ తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముక్కు అవినాష్ ఎన్నో స్కిట్లలో నవ్వించాడు. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా జోకర్ గెటప్‌తో హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన కామెడీ మార్క్ తో బాగానే ఎంటర్ టైన్ చేసుకుంటూ వచ్చాడు అవినాష్. బోర్ గా సాగే బిగ్ బాస్ షోను తన రాకతో నిత్యం కామెడీని పంచుతూ కంటెస్టెంట్లు అందరిలో కామెడీ సెన్స్ ను పెంచాడు. కానీ ఇంత చేసినా అవినాష్ కి మిగిలింది చివరకు ఎలిమినేషనే. అయితే అవినాష్ ను హౌస్ నుండి బయటకు పంపడానికి చాలా డ్రామానే జరిగింది.
హౌస్‌లో ముక్కు అవినాష్ కంటెస్టెంట్లు అందరితోనూ కలిసే ఉన్నా.. ఆరియానా గ్లోరీతో క్లోజ్ గా ఉండటం, అలాగే నామినేషన్స్ టాస్కులో ఎవరైనా తనను నామినేట్ చేస్తే అస్సలు తట్టుకోలేకపోవడం లాంటి అంశాలు అవినాష్ కి బాగా మైనస్ అయ్యాయి. అయితే హౌస్‌మేట్లు అందరినీ ఇమిటేట్ చేయడంతో పాటు వీకెండ్ ఎపిసోడ్స్‌లో అద్భుతమైన టైమింగ్‌తో పంచులు పేలుస్తూ సమంత, నాగార్జున నుంచే బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నా.. ఎలిమినేషన్ నుండి మాత్రం అవినాష్ తప్పించుకోలేకపోయాడు. ఇక బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన అవినాష్ పేరిట ఓ రికార్డు నమోదైంది. బిగ్ బాస్ చరిత్రలోనే వరుసగా రెండు వారాలు ఎలిమినేట్ అయ్యాడు. ఇలా ఒకే కంటెస్టెంట్ ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా రెండు సార్లు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడం బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి అట.


