బిగ్ బాస్ షాకింగ్ గిఫ్ట్, ఉద్వేగానికి గురైన శివజ్యోతి

Published on Oct 16, 2019 1:18 pm IST

బిగ్ బాస్ షో ఫేవరేట్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న శివజ్యోతికి బిగ్ బాస్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చాడు. అనుకోని అతిధిగా ఆమె భర్తను హౌస్ లోకి పంపించి ఆమెకు షాక్ ఇచ్చాడు. టాస్క్ మధ్యలో ఉన్న శివజ్యోతి సడన్ గా హౌస్ లోకి ఎంటరైన హస్బెండ్ ని చూసి ఉద్వేగానికి గురైంది. బిగ్ బాస్ పర్మిషన్ తో అతనితో కొంచెం సేపు ముచ్చటించే అవకాశం దక్కించుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న శివ జ్యోతి షో ఎలిమినేషన్ కి నామినేట్ ఐయ్యింది చాలా తక్కువ. రాహుల్, మహేష్, వరుణ్ వంటి వాళ్ళతో పోల్చుకుంటే ఆమె తక్కువగా నామినేట్ అవుతూ వచ్చారు.

ఇక ఈవారం హౌస్ లో ఉన్న అందరూ సభ్యలు ఎలిమినేషన్ కి నామినేట్ కావడం విశేషం. మహేష్ ఎలిమినేషన్ తో మిగిలిన రాహుల్, వరుణ్, శ్రీముఖి, వితిక, అలీ రెజా, శివ జ్యోతి, బాబా భాస్కర్ ఏడుగురు నామినేట్ కావడంతో వచ్చే వారం ఎలిమినేషన్ పై ఆసక్తి నెలకొంది. ఈ ఏడుగురిలో ఐదుగురు ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉండటంతో ఎలిమినేట్ ఐయ్యే ఆ ఇద్దరు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత సమాచారం :

X
More