ఆ స్టార్ హీరోపై ‘బిగ్ బాస్ 3’ ప్రోమో చిత్రీకరణ

Published on Jun 18, 2019 1:08 pm IST

స్టార్ మా ప్రతిష్టాత్మక రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 3 త్వరలోనే మొదలు కానుంది. ఇంతకు ముందు వచ్చిన రెండు సీజన్లు భారీ విజయం సాధిచడంతో స్టార్ మా ఇంకా సరికొత్త గా ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ప్రోగ్రాం ని రూపొందిస్తున్నారట. ఈ సారి బిగ్ బాస్ 3లో ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే వైవిధ్యమైన టాస్కులు,ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని సమాచారం.

మరో విశేషం ఏమిటంటే ఈ షో హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరించడం.దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేనప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సారి బిగ్ బాస్ హోస్ట్ భాధ్యతలు నాగార్జునకే స్టార్ మా యాజమాన్యం అప్పగించారని తెలుస్తుంది.హైదరాబాద్ లో ఈ ప్రోగ్రాం ప్రోమో కొరకు జరుగుతున్న షూటింగ్లో కూడా నాగార్జున పాల్గొంటున్నారట. ఇదివరకు నాగార్జున “మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా చేసి ఆ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ కావడంలో కీలకపాత్ర వహించారు. దీనితో బిగ్ బాస్ కూడా కింగ్ నాగార్జున సారధ్యంలో ఘనవిజయం సాధిస్తుందని స్టార్ మా యాజమాన్యం గట్టినమ్మకంతో ఉన్నారట. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న “మన్మధుడు 2” ఆగస్టు 9న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More