బిగ్ బాస్ కెమెరాలని వారిద్దరిపైనే.

Published on Aug 17, 2019 10:02 pm IST

బిగ్ బాస్ అంటేనే సంచలనాలకు నెలవు. ఇంటి సభ్యుల మధ్య ఎప్పుడు ఎటువంటి గొడవలు మొదలవుతాయో, ఎప్పుడు ఎటువంటి బంధాలు మొదలవుతాయో చెప్పలేం. కాగా బిగ్ బాస్ ఇంటి సభ్యులలోని ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ ఎవరంటే నటి పునర్నవి మరియు సింగర్ రాహుల్. ఇంటిలో ఈ ఇద్దరు సన్నిహితంగా మెలగడంతో బిగ్ బోస్ షో ఆసక్తికరంగా మారింది. దీనితో బిగ్ బాస్ కెమెరాలు ఫోకస్ వీరిపైనే పెట్టాయి. మరి వీరి బంధం ఎక్కడి దారితీస్తుందో, ఎంత వరకు సాగుతుందో చూడాలి మరి.

కాగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి ముగ్గురు ఎలిమినేట్ కబడ్డారు. వారిలో నటి హేమ, రిపోర్టర్ జాఫర్, మరియు తమన్నా ఉన్నారు. దీనితో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనే విషయం పై ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :