సంక్రాంతికి త్రిముఖ పోరు తప్పదా ?


సంక్రాంతి వస్తుందంటే పెద్ద హీరోల సినిమాల విడుదల హడావిడి ఎప్పుడు ఉండేదే. కాకపోతే ఈసారి విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకుల్లో మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సంక్రాంతికి మొత్తం 3 పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. దాంట్లో మొదటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఇటీవల చిత్ర నిర్మాత దానయ్య డి వి వి ప్రకటించాడు. ఇక క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించనున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఇంతకుముందే ప్రకటించారు నిర్మాతలు.

ఇక తరువాతి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం. దీన్ని కూడా సంక్రాంతి బరిలోనే నిలపాలని బావిస్తున్నారట అశ్వినీ దత్, దిల్ రాజులు. నిన్ననే ఈ చిత్ర షూటింగ్ డెహ్రాడూన్ లో ప్రారంభమైంది. ఈ మూడు సినిమాలతో ఈసారి సంక్రాంతి పోరు గట్టిగానే ఉండనుంది. మరి ఈ రేసులో ఏ చిత్రాన్ని విజయం వరిస్తుందో చూడాలి.