విజయ్ పార్టీ లోకి లారెన్స్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో హింట్!

విజయ్ పార్టీ లోకి లారెన్స్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో హింట్!

Published on Jun 7, 2026 4:03 PM IST

కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన దళపతి విజయ్ ఇప్పుడు తన మొదటి సారి ఎన్నికల పోటీ లోనే సీఎం గా మారి చరిత్ర సృష్టించారు. అయితే విజయ్ సీఎం గా అవ్వాలంటే తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో నుంచి తిరుచ్చి ఈస్ట్ లో రాజీనామా చేయడం తప్పనిసరి కావడంతో ఆ సీట్ కి రాజీనామా చేసి సీఎం అయ్యారు. అయితే ఈ నియోజకవర్గం ఖాళీ కావడంతో ఇందులో స్టార్ హీరోయిన్ త్రిష పోటీ చేస్తుంది అని ఇతర కొన్ని కామెంట్స్ ఆ మధ్య వినిపించాయి.

లేటెస్ట్ గా ప్రముఖ దర్శకుడు, హీరో, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ పేరు గట్టిగా వినిపించింది. అయితే దీనిపై లారెన్స్ ఇచ్చిన స్పందన ఒకింత ఇంట్రెస్టింగ్ గా మారింది. తాను తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నాను అనే వార్తలని తాను ఖండించకుండా ప్రస్తుతం తన సినిమాల్లో బిజీగా ఉన్నాను అని అయితే ఈ జూన్ 11న తీసుకోబోతున్న కీలక డెసిషన్ పై ఉదయం 9 గంటల 30 నిమిషాలకి అనౌన్స్ చేయబోతున్నాను అని తెలిపారు.

దీనితో విజయ్ పార్టీ లోకి లారెన్స్ వెళ్లడం ఖాయం అని అక్కడ నుంచే పోటీ చేయబోతున్నాడని దాదాపు అంతా ఫిక్స్ అయ్యిపోయారు. లారెన్స్ రాజకీయాల్లో లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వం తరపున తన సాయం మరింతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు