కార్తికేయకు పెద్ద ఆఫర్ ఉన్నట్టుంది

Published on Dec 8, 2019 1:09 pm IST

ఇటీవలే ’90 ఎం.ఎల్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు హీరో కార్తికేయ. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఈ సినిమాతో 2019కి శుభం కార్డ్ వేయాలనుకున్న ఆయనకు నిరుత్సాహం ఎదురైందనే అనాలి. ఇలా వరుస పరాజయాలు ఎదురవడం వలన ఆయన కెరీర్ ఇబ్నందుల్లో పడుతుందని, అయన సినిమా అవకాశాలు తగ్గుతుందని అనుకున్నారు. కానీ ఈ యువ హీరోకి ఒక పెద్ద ఛాన్స్ రెడీగా ఉందట.

ఒక పెద్ద నిర్మాత తన నిర్మాణ సంస్థలోనే కార్తికేయతో సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరిగి ప్రాజెక్ట్ ఫైనల్ అయిందట. త్వరలోనే ఈ అఫీషియల్ క్కన్ఫర్మేషన్ వెలువడే అవకాశం ఉంది. మరి కార్తికేయకు ఆఫర్ ఇచ్చిన ఆ బడా నిర్మాత ఎవరు, సినిమా వివరాలేమిటి అనేది తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More