ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి రామ్ చరణ్ సినిమా హక్కులు !

ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి రామ్ చరణ్ సినిమా హక్కులు !

Published on Jun 19, 2018 5:57 PM IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి . ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ సుమారు 75 కోట్లు నాన్-రికవర్బుల్ అడ్వాన్స్ (NRA) చెల్లించి ఈ చిత్ర హక్కులని దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి . రంగస్థలం సినిమా తో రామ్ చరణ్ సాలిడ్ హిట్ కొట్టడం వల్ల ఈ సినిమాకి భారీ మొత్తంలో వెచ్చించి ఈ హక్కులు దక్కించుకున్నారట యు వి క్రియేషన్స్ .

‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు . డి వి వి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్ , స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు . ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు