‘పుష్ప’లో భారీ ట్విస్ట్ ప్లాన్ చేసిన సుకుమార్ ?

Published on Jan 25, 2021 9:20 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ‘రంగస్థలం’ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. కోవిడ్ లాక్ డౌన్ అనంతరం షూటింగ్ మొదలైనా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కున్న టీమ్ మళ్లీ చిత్రీకరణను రెస్యూమ్ చేసింది. సినిమా శేషాచలం అడవుల్లో జరిగే స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో అని అందరికీ తెలుసు. అందుకే మేకింగ్ ఎక్కువగా అడవుల బ్యాక్ డ్రాప్లోనే జరుగుతోంది. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ విదేశాల్లో కూడ ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న షెడ్యూల్ ముగియగానే చిత్ర బృందం విదేశాలకు వెళ్లే అవకాశం ఉందట. దీన్నిబట్టి సుకుమార్ కథలో ఏదో ఊహకందని, బలమైన ట్విస్ట్ ప్లాన్ చేశారని అనిపిస్తుంది. మరి ఆ ట్విస్ట్ ఏంటి, అసలు స్మగ్లర్ పుష్పక విదేశాల్లో ఏం పని లాంటి విశేషాలు తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. బన్నీ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మితమవుతున్న సినిమా ఇది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.

సంబంధిత సమాచారం :

More