బిగ్ అప్డేట్..”పుష్ప”లో ఈ మళయాళ స్టార్ హీరో.!

Published on Mar 21, 2021 10:22 am IST

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇంటిలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై సాలిడ్ అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈరోజు పుష్ప మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ను రివీల్ చేస్తామని తెలిపారు.

మరి ఆ బిగ్ అప్డేట్ ను వారు రివీల్ చేసేసారు. ఈ చిత్రంలో మళయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసీల్ కీలక పాత్రలో చేస్తున్నట్టుగా రివీల్ చేసారు. ఈ టాలెంటెడ్ నటుడు తెలుగులో ఎలాంటి సినిమా చేయనప్పటికీ మన తెలుగు ఆడియెన్స్ లో కూడా చాలా మందికి సుపరిచితమే..

మరి ఈ చిత్రంలో ఈ టాలెంటెడ్ హీరో గత కొన్నాళ్ల నుంచి ఈ చిత్రంలో సస్పెన్సు గా నిలిచిన విలన్ రోల్ లో నటించడం మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.. మరి బన్నీ మరియు ఫహద్ మధ్య సీన్స్ సుకుమార్ ఎలా ప్లాన్ చేసారో చూడాలి.ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :