బిగ్ అప్డేట్ : మోస్ట్ అవైటెడ్ “కేజీయఫ్ 2” ట్రైలర్ కి డేట్, టైం ఫిక్స్.!

Published on Mar 3, 2022 11:50 am IST

పాన్ ఇండియా వైడ్ మళ్ళీ వీక్షకులు ఓ భారీ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” అనే చెప్పాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కన్నడ రాకింగ్ స్టార్ యాష్ మరియు శ్రీనిధి శెట్టి లతో చేసిన ఈ భారీ సినిమా తారా స్థాయి అంచనాలు అన్ని భాషల్లో కూడా నెలకొల్పుకుని విడుదలకి సిద్ధంగా ఉంది.

మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా నుంచి ట్రైలర్ ని చూద్దామని అంతా ఎప్పుడు నుంచో అత్యంత ఆసక్తిగా ఉండగా ఇప్పుడు మేకర్స్ ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ కి తెర దించేశారు. ఈ చిత్రం ట్రైలర్ ని ఈ మార్చ్ 27 న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు భారీ ఈవెంట్ తో లాంచ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనితో ఫైనల్ గా ఈ భారీ సినిమా ట్రైలర్ లాంచ్ ఎదురు చూపులకి ఒక బ్రేక్ పడింది అని చెప్పాలి. మరి ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ అని అందుకుంది. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :