టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న సినిమా ‘అరవింద సమేత’. కాగా తాజాగా ఈ సినిమా బిజినెస్ కు సంబంధించిన ఓ వార్త ఇపుడు, ఎన్టీఆర్ అభిమానులను తెగ ఉత్సాహపరుస్తోంది.
గత కొంతకాలంగా రాయచూర్ లో ఎన్టీఆర్ సినిమాలకు అడిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. జనతా గ్యారేజ్ అక్కడ 65 లక్షలు వసూల్ చేయగా, జైలవకుశ 74 లక్షలు వసూల్ చేసింది. ఇప్పుడు అరవింద సమేత బిజినెస్ కూడా కోటి పలికింది. బాహుబలి తర్వాత రాయచూర్ లో కోటి రేటు పలికిన ఓకే ఒక్క సినిమా ‘అరవింద సమేత’ కావడం విశేషం.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇటు తండ్రిపాత్రలోనూ.. అలాగే అటు కొడుకు పాత్రలోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈషా రెబ్బా తండ్రి పాత్ర సరసన నటించందని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


