ఓజి డైరెక్టర్ శంకర్ డ్రీం ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్!

ఓజి డైరెక్టర్ శంకర్ డ్రీం ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్!

Published on Dec 2, 2025 10:34 AM IST

shankar

ఇండియన్ సినిమా దగ్గర తన సినిమాలతో ఎప్పుడో కొత్త ఒరవడి సృష్టించి ఇండియన్ సినిమా దగ్గర ఓజి దర్శకుడు అనిపించుకున్న శంకర్ నుంచి రీసెంట్ గా వచ్చిన సినిమాలు నిరాశనే మిగిల్చిన సంగతి తెలిసిందే. దీనితో తన అభిమానులు గట్టి కంబ్యాక్ కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండగా శంకర్ నుంచి గేమ్ ఛేంజర్ తర్వాత తన డ్రీం ప్రాజెక్ట్ ‘వేల్పారి’ నే ఉంటుంది అని తాను కన్ఫర్మ్ చేశారు.

మరి తనని నమ్మి ఎవరు చేస్తారు? ఏ నిర్మాత ముందుకు వస్తారు అసలు శంకర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేవి సస్పెన్స్ గా మారాయి. కానీ లేటెస్ట్ గా బిగ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. శంకర్ డ్రీం ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం అవుతుందట. ఈ సినిమాని తమిళ ఓ బిగ్ స్టార్ హీరోగా పెట్టి వచ్చే ఏడాది స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది. దాదాపు జూన్ నుంచే షూటింగ్ మొదలు పెట్టనున్నారట. మరి ఈ సినిమాని శంకర్ ఏ లెవెల్లో ప్లాన్ చేస్తారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు