బిగ్ అప్డేట్..థలపతి విజయ్ తో వంశీ ప్రాజెక్ట్ ఫిక్సే.!

Published on May 30, 2021 8:38 am IST

మన సౌత్ ఇండియన్ సినిమాలో భారీ మార్కెట్ అండ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోస్ లో ఇళయ థలపతి విజయ్ కూడా ఒకరు. మరి ప్రస్తుతం మాస్టర్ సినిమా తర్వాత కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం అనంతరం డైరెక్ట్ టాలీవుడ్ చిత్రం లో నటించనున్నారని టాక్ వచ్చింది.

మన దగ్గర స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారని బజ్ వచ్చింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం వచ్చేసింది. వంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో థలపతి విజయ్ తో అలాగే దిల్ రాజు కాంబోలో సినిమా ఉందని. ఆ సాలిడ్ ప్రాజెక్ట్ ను ఈ కోవిడ్ ప్యాండమిక్ తగ్గాక అనౌన్స్ చేస్తామని వంశీ కన్ఫర్మ్ చేశారు. సో విజయ్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ అధికారికంగానే లైన్ లో ఉందని కన్ఫర్మ్ అయ్యింది..

సంబంధిత సమాచారం :