రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Published on Jan 25, 2021 2:15 pm IST

క‌రోనా మ‌హ‌మ్మారితో సినీ ప్ర‌పంచం మెత్తం అత‌లాకుత‌లమైంది. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియకుండా పోయింది. దర్శకనిర్మాతలు పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటించి ఆ దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలో సడెన్ గా ఈ కరోనా మహమ్మారి వచ్చి సినిమా ఇండస్ట్రీని స్తంభింప చేసేసింది. అందులో భాగంగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ మారింది.

కాగా తాజాగా 2021 అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల అవుతున్నట్లు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రకటించింది. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :